మీటర్ నుండి ‘చమ్మక్ చమ్మక్ పోరి’ సాంగ్ రిలీజ్

హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. రీసెంట్ గా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా తో వచ్చి సూపర్ హిట్ అందుకున్న కిరణ్..ఇప్పుడు మీటర్ అంటూ ఏప్రిల్ 07 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్లాప్ – మైత్రీ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి, రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక విభిన్నమైన కథాంశంతో రాబోతున్న ఈ మూవీ ఫై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.

ఇప్పటికే సినిమా తాలూకా ప్రమోషన్స్ ను భారీగా జరుపుతుండగా..తాజాగా సినిమాలోని ఓ మాస్ బీట్ ను విడుదల చేసారు. ‘చమ్మక్ చమ్మక్ పోరి .. న ధడకు ధడకు నారి’ అంటూ ఈ పాట సాగుతోంది. సాయికార్తీక్ స్వరపరిచిన ఈ పాటకు బాలాజీ సాహిత్యాన్ని అందించగా, అరుణ్ కౌండిన్య – గాయత్రి ఆలపించారు. భాను కొరియోగ్రఫీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా కిరణ్ అబ్బవరం కనిపించగా.. ఈ సినిమాతో, తెలుగు తెరకు అతుల్య రవి కథానాయికగా పరిచయమవుతోంది.

YouTube video