రెండో పెళ్లి ఫై నటి మీనా క్లారిటీ

సీనియర్ నటి మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు గత రెండు , మూడు రోజులుగా తమిళ్ మీడియా లో , సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుండడం తో..ఆ వార్తల ఫై మీనా క్లారిటీ ఇచ్చింది. మీనా భర్త విద్యా సాగర్ ఈ మధ్యనే అనారోగ్యం తో కన్నుమూశారు. ఆ బాధ నుండి మీనా కుటుంబ సభ్యులు బయటపడకముందే..ఆమె మరో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వైరల్ గా మారాయి.

దీంతో మీనా క్లారిటీ ఇచ్చింది. తాను మరో పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేసింది. తన భర్త మరణించినప్పుడు కూడా అసత్యాలను ప్రచారం చేశారని చెప్పింది. ఆ బాధ నుంచి తేరుకోక ముందే వివాహం ఎలా చేసుకుంటానని పేర్కొంది. ప్రస్తుతం కొత్తగా కథలను వింటున్నానని వెల్లడించింది. ఫిబ్రవరి నుంచి షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్టు తెలిపింది.

1975, సెప్టెంబర్ 16న మద్రాసులో జన్మించిన మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వారు. ఈయన తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి. మీనా తెలుగు, తమిళ చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసింది. బాలనటిగా రజినీకాంత్, కమలహాసన్ తదితర నటులతో నటించి ఆ తరువాత కథానాయికగా యెదిగింది. ఈమె నటించిన తమిళ సినిమాల్లో ముత్తు, యజమాన్, వీరా, అవ్వై షణ్ముగి మంచి విజయాలు సాధించాయి. ఈమె రజనీకాంత్ తో నటించిన సినిమాలు జపాన్లో కూడా విడుదలై మంచి ఆదరణ పొందడము చేత ఈమెకు జపాన్లో కూడా మంచి అభిమానవర్గము ఉంది. మీనా దాదాపు అన్ని దక్షిణ భారత భాషా సినిమాల్లో నటించింది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రరంగములలోని అగ్ర నాయకులందరితో కలిసి పనిచేసింది. తెలుగులో వెంకటేష్, మీనా జంటగా సుందర కాండ, చంటి, సూర్య వంశం, అబ్బాయిగారు వంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఇలా తెలుగు, తమిళ చిత్రరంగాలలో 1991 నుండి 2000 వరకూ, సుమారు ఒక దశాబ్దం పాటు అగ్రతారగా నిలిచింది.