ఆసియాలోనే ఐఎస్ బి టాప్ బిజినెస్ స్కూల్ : ప్రధాని మోడీ

YouTube video
PM Modi’s address on completion of 20 years of Indian School of Business, Hyderabad

హైదరాబాద్ : ప్రధాని మోడీ ఐఎస్ బీ 20వ వార్షికోత్స‌వానికి హాజ‌ర‌య్యారు. ఐఎస్ బీ గురించి డీన్ మ‌ద‌న్ మోడీకి వివ‌రించారు. ఐఎస్ బి ప్ర‌త్యేక పోస్ట‌ల్ క‌వ‌ర్ ని ప్ర‌ధాని ఆవిష్క‌రించారు. అక‌డ‌మిక్ సెంట‌ర్ లో ప్ర‌ధాని మొక్క‌ని నాటారు. అనంత‌రం మోడీ ప్ర‌సంగించారు. ఐఎస్ బి ఈ స్థాయికి రావ‌డం వెనుక చాలా మంది కృషి ఉంద‌న్నారు. 2001లో ఆనాటి ప్ర‌ధాని వాజ్ పేయ్ దీన్ని ప్రారంభించార‌న్నారు. నేడు ఆసియాలోనే ఐఎస్ బి టాప్ బిజినెస్ స్కూల్ అని చెప్పారు. ఐఎస్ బి లో చ‌దివిన వారు విదేశాల్లో ఉన్న‌త హోదాలో ఉన్నార‌న్నారు. ఐఎస్ బి దేశానికే గ‌ర్వకార‌ణం అన్నారు మోడీ. వ‌చ్చే 25ఏళ్ల‌కు రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నాం..ఆ ప్ర‌ణాళిక‌ల్లో మీకు చాలా కీల‌క పాత్ర ఉంటుంద‌న్నారు. జి20 దేశాల్లో భార‌త్ అతి వేగంగా అభివృద్ధి చెందుతోంద‌న్నారు. ఇంట‌ర్నెట్ వాడ‌కంలో భార‌త్ రెండో స్థానంలో ఉంద‌న్నారు. ప్ర‌పంచంలో 3వ అతిపెద్ద స్టార్ట‌ప్ వ్య‌వ‌స్థ భార‌త్ లో ఉంద‌ని మోడీ అన్నారు. క‌రోనా స‌మ‌యంలో భార‌త్ త‌న శ‌క్తి ..సామ‌ర్థ్యాల‌ను ప్ర‌పంచానికి చూపించింద‌న్నారు. ఐఎస్ బి త‌న ప్ర‌యాణంలో కీల‌క మైలురాయిని చేరింద‌న్నారు. ఐఎస్ బి ఈ స్థాయికి రావ‌డం వెనుక చాలా మంది కృషి ఉంద‌న్నారు.  ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ హాజరయ్యారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/