మాజీ మంత్రి మాణిక్యాలరావు కన్నుమూత

నెల రోజుల క్రితం కరోనా బారిన పడిన మాణిక్యాలరావు

Manikyala rao

విజయవాడ: బిజెపి నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనాతో మృతి చెందారు కరోనా బారిన పడిన ఆయన… నెల క్రితం విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. 2014 ఎన్నికల్లో బిజెపి తరపున పోటీ చేసి గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/