తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2,97,278

మృతుల సంఖ్య 1,623

coronavirus in telangana
coronavirus in telangana

Hyderabad: తెలంగాణలో కరోనా వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు గత 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 35 కరోనా కేసులు నమోదయ్యాయి. మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రంలో కొత్తగా 165 మంది కరోనా బారిన పడ్డారు.

దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,97,278కి చేరింది. అదే సమయంలో కరోనా కాటుకు ఒకరు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 1,623కు చేరింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/