సీఎం వద్ద పరీక్షల తేదీలపై చర్చ జరగలేదు

అమరావతి: ఏపీ లో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల తేదీలపై సీఎం జగన్ వద్ద ఎటువంటి చర్చ జరగలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు నోటీసుల విషయం తమ దృష్టికి రాలేదన్నారు. వచ్చిన తర్వాత సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మొదటి నుంచి తమ వైఖరి ఒక్కటేనని, ఒక వేళ నోటీసులు వస్తే తమ నిర్ణయాని వినిపిస్తామని స్పష్టం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/