యూట్యూబ్ కీలక నిర్ణయం!

యూజర్లను తప్పుదారి పట్టించే ప్రకటనలు, అసత్య ప్రచారాలకు బ్రేక్

YouTube key decision
YouTube key decision

గ్యాంబ్లింగ్‌, ఆల్కాహాల్‌, పాలిటిక్స్‌, డ్రగ్స్‌కు లింకు ఉన్నయాడ్స్ ఇకపై యూట్యూబ్‌ టాప్‌, హోం పేజీలో కనిపించవని యూట్యూబ్‌ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. యూట్యూబ్‌ను ఓపెన్‌ చేయగానే టాప్‌లో కనిపించే ఈ యాడ్స్‌ ద్వారా గూగుల్‌కు భారీ ఆదాయం వస్తుంటుంది. ఇకపై ఆ ప్రదేశంలో యూజర్లకు పనికొచ్చేవి, అవగాహనకు సంబంధించిన యాడ్‌లే ఉండాలని యూట్యూబ్‌ నిర్ణయించింది. యూజర్ల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు పేర్కొంది. యూజర్లను తప్పుదారి పట్టించే ప్రకటనలను, అసత్య ప్రచారాలకు యూట్యూబ్‌లో చోటు ఉండదని స్పష్టం చేసింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/