ఏపీకి తుపాను ముప్పు..

వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడు వర్షం పడుతుందో..ఎప్పుడు ఎండలు కొడుతాయో అర్ధం కావడం లేదు..ఒకప్పుడు వర్ష కాలంలో ఎక్కువగా వర్షాలు పడేవి కానీ ఇప్పుడు ఆలా కాదు చలి కాలం , ఎండాకాలం అనే తేడాలు లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయ్. తాజాగా ఇప్పుడు ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

దక్షిణ అండమాన్‌, మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి గురువారానికి వాయుగుండంగా మారుతుందని, అనంతరం అది వాయవ్య దిశగా కదిలి శనివారానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు… కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో డిసెంబరు 4 నుంచి 6 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పంటలు కోత దశలో ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే వెనక్కి రావాలని హెచ్చరికలు జారీ చేశారు.