బీఆర్ఎస్ నేత ఇంట్లో భారీ నగదు పట్టుకున్న అధికారులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం వచ్చేసింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. ఈ క్రమంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అన్ని పార్టీల నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బు పంపిణి చేస్తూ..ఓటు ను కొనుగోలు చేస్తున్నారు.

ఈ క్రమంలో మంగళవారం వర్థన్నపేట మండలం బొక్కలగూడెం గ్రామంలో బీఆర్ఎస్ నేత ఇంట్లో భారీ నగదు నిల్వ ఉందన్న సమాచారంతో వెంకటేశ్వర్ రావు ఇంట్లో పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టి నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్జ నగదుకు సరైన పత్రాలు చూపకపోవడంతో.. నగదును స్థానిక పోలిస్ స్టేషన్‌కు తరలించారు. ఇదొక్కటే రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుండి పెద్ద ఎత్తున నగదు పట్టుబడుతోంది.