పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందిః సిఎం జగన్‌

రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన జగన్

YouTube video
Hon’ble CM will be Participating in the Programmes at Ramco Cements, Kolimigundla, Nandyal District

అమరావతిః సిఎం జగన్‌ నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్లలో రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. ఒక పరిశ్రమ రావడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని… స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అన్నారు. రామ్ కో సిమెంట్ పరిశ్రమతో వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఏపీనే ఉదాహరణ అని అన్నారు.

పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ… పారిశ్రామిక అభివృద్ధితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న చర్యలతో రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని కొనియాడారు. పరిశ్రమలకు తమ ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలను ఇస్తోందని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/