బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలే గెస్ట్ గా చరణ్..అంతే కాదు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 చివరి వారానికి వచ్చేసింది. మరో 5 రోజుల్లో విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఫైనల్ లిస్ట్ లో సన్నీ , మానస్ , శ్రీరామ చంద్ర , షన్ను , సిరి లు ఉన్నారు. ఆదివారం నుండే ఆడియన్స్ వోటింగ్ మొదలైంది. ప్రస్తుతం సన్నీ వోటింగ్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. మిగతా రోజుల్లో కూడా ఇదే వోటింగ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇదిలా ఉంటె బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలే ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తుంది బిగ్ బాస్ యాజమాన్యం.

గ‌త రెండు సీజ‌న్స్ కి చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజ‌రు కాగా, ఈ సారి మాత్రం బాలీవుడ్ స్టార్స్‌ని కూడా దింప‌బోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌టీమ్‌ నుంచి రామ్‌చరణ్‌, అలియాభట్‌,83` సినిమా నుంచి రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా గెస్ట్ లుగా రాబోతున్నారని అంటున్నారు. ఈ షోలో తమ సినిమాని ప్రమోట్‌ చేసుకోవాలని కూడా రణ్‌వీర్‌, దీపికా టీమ్‌ భావిస్తుందట. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. గ్రాండ్‌ ఫినాలేకు ఈ నలుగురు సినిమా ప్ర‌మోషన్స్‌లో భాగంగా హాజ‌రు కానుండ‌గా, క‌ప్ ఇచ్చేందుకు రాజమౌళి , ఎన్టీఆర్ లు వస్తారని అంటున్నారు. మరి ఈవార్తల్లో ఎంత నిజం అనేది చూడాలి. ఒక వేళ ఇదే నిజమైతే అభిమానులకు , సీజన్ విన్నర్ కు కన్నుల పండగే.