త్వరలోనే విశాఖలో చంద్రబాబు పర్యటిస్తారు
నిన్న పోలీసుల అండతోనే వైఎస్ఆర్సిపి నేతలు రౌడీయిజం చేశారు

విశాఖపట్టణం: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భూకబ్జాలు బయటపడతాయనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అడ్డుకున్నారని బొండా ఉమ విమర్శించారు. జగన్ రౌడీయిజానికి భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై విశాఖ జగదాంబ సెంటర్లో తేల్చుకుంటామన్నారు. త్వరలోనే విశాఖలో చంద్రబాబు పర్యటిస్తారని..దమ్ముంటే అడ్డుకోవాలని బోండా ఉమ సవాల్ విసిరారు. టిడిపి సత్తా ఏంటో చూపిస్తామన్నారు. నిన్న పోలీసుల అండతోనే వైఎస్ఆర్సిపి నేతలు రౌడీయిజం చేశారన్నారు. విశాఖలో ప్రజాస్వామ్యం ఖూనీపై కోర్టుకి వెళ్తామన్నారు. విశాఖ ఘటనపై గవర్నర్‌కి ఫిర్యాదు చేస్తామని బోండా ఉమ స్పష్టం చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/