మితిమీరి వాడితే హెల్త్‌కి బ్రేక్‌

ఏ వస్తువు లేకుండా ఒక్క పదినిమిషాలు ఉండలేరు? అని అడిగే స్మార్ట్‌ఫోన్‌ అని ఠక్కున చెప్పే పరిస్థితులు వచ్చాయి. ప్రస్తుతం చాలా మంది పరిస్థితి అలాగే ఉంది మరి! యాప్‌లు, గేమ్‌లు, ట్వీట్‌లు, మెసేజింగ్‌లు, చేస్తున్నారు. ఇలా బ్రేక్‌ లేకుండా వాడితే ఆరోగ్యానికి హాని అని వైద్యులు చెపుతున్నారు. మితిమీరిన ఫోన్‌ వాడకం మంచిది కాదంటున్నారు.

Mobile using

చాలా మంది రాత్రి పడుకునే ముందు ట్వటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, వాట్సప్‌ ఇలా రకరకాల సామాజిక మాధ్యమాల్లో కాసేపు గడిపి నిద్రపోతున్నారని సర్వేలు అంటున్నాయి.

కంప్యూటర్‌, సెల్‌ఫోన్‌ తెరలు కంటికి దగ్గరగా ఉండడం వల్ల నిద్ర సమస్యలు అధికమవుతున్నాయి. గాఢ నిద్రకి ఇది ఏ మాత్రం మంచిది కాదంటున్నారు. ఎక్కడపడితే అక్కడ ఫోన్‌ పెట్టేస్తుంటారు.

దీంతో దానిపై ఎన్నో రకాల బ్యాక్టీరియా చేరుతుంది. ఫోన్‌ మాట్లాడేటప్పుడు, దగ్గరగా చూస్తున్నప్పుడు నోరు, ముక్కు ద్వారా శరీరంలోకి బ్యాక్టీరియా చేరుతుంది.

ఫోన్‌ని ఎక్కువగా వాడితే దూరపు చూపు దెబ్బతినే ప్రమాదంముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

కేవలం కంటి చూపు మాత్రమే కాదు. తలని ఎక్కువ సమయం ఒకే స్థితిలో ఉంచడం వల్ల మెడపై బరువు పడుతుంది. దీంతో మెడనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. పదే పదే ఫోన్‌ వినియోగంతో మానవ సంబంధాలు దెబ్బతింటాయి.

ఇతరులతో మాట్లాడడం మానేసి టెక్ట్స్‌ చేస్తున్నారు. ఎమోజీల్లోనే ఎమోషన్స్‌ చూపిస్తున్నారు. దీంతో చుట్టు ఉన్న మనుషులు దూరం అవుతున్నారు. ఎప్పుడూ ఏదో ఒక ఆందోళన. లైక్‌లు లేవనో, కామెంట్స్‌ కాలేదనో, దీంతో రియల్‌ లైఫ్‌లో ఎన్నో మానసిక సమస్యలు చేస్తున్న పనిపై ఫోకస్‌ పెట్టలేకపోవటం.

డెడ్‌లైన్‌ లోపు లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఫోన్‌ వాడుతూ వాహనాలు నడపడం. యువత ఎక్కువగా ప్రమాదాల్లో పడడానికి ప్రధాన కారణం.

రాను రాను ఇవి ఇంకా ఎక్కువ అవుతున్నాయి.

డ్రైవింగ్‌ చేస్తూనే కాకుండా ఫక్షన్‌ చూసుకుంటూ నడుస్తూ ఎదురుగా వచ్చే వాహనాలను గమనించక ప్రమాదాల బారిన పడుతున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/