రైతులకు బీమా ప్రీమియాన్నివిడుదల

Release of RABI 2018-19 corp Insurance to Farmers by Hon’ble CM of AP at CM Camp Office

అమరావతి: సిఎం జగన్‌ రైతులకు బీమా ప్రీమియాన్ని చెల్లించేందుకు.. రూ. 596.36 కోట్లు శుక్రవారం విడుదల చేశారు. ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. తద్వారా 5,94,005 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈసందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. 2019-2020 నుంచి రైతులందరికీ ఉచితంగా వైఎస్సార్‌ పంటల బీమా అమలు చేస్తామని తెలిపారు. అదే విధంగా రైతు వేసిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పిస్తామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. కేవలం రైతులు రూపాయి కడితే చాలు.. రైతులు భరోసా కేంద్రంలోనే ఇ- క్రాపింగ్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా.. గ్రామ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్, రెవిన్యూ అసిస్టెంట్లు, సర్వేయర్‌ కలిసి ఇ- క్రాపింగ్‌ రిజిస్టర్‌ చేసి.. వెంటనే ఇన్సూరెన్స్‌ను కట్టేలా ఏర్పాటు చేస్తారన్నారు. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం కడుతుందని.. బీమా పరిహారం పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/