ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో 1,83,710 కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,10,205

Coronavirus
Coronavirus

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా గత 24 గంటల్లో 1,83,710 కరోనా‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,10,205కు చేరిగా వారిలో ఇప్పటివరకు 52,79,579 మంది కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 39,38,843 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 7,000 మంది కరోనాతో మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌19 బారిన పడి మొత్తం 4,91,783 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు..

బ్రెజిల్‌లో కరోనా కేసుల సంఖ్య 12,33,147- మృతులు 55,054..రష్యాలో కరోనా కేసులు 6,13,994- మృతులు 8605..యూకేలో కరోనా కేసులు 3,07,980-మృతులు 43,230..స్పెయిన్‌లో కరోనా కేసులు 2,94,566- మృతులు 28,330..పెరులో కరోనా కేసులు 2,68,602 – మృతులు 8761..చిలీలో కరోనా కేసులు 2,59,064- మృతులు 4,903.. ఇటలీలో మొత్తం కేసులు 2,39,706- మృతుల సంఖ్య 34,678..ఇరాన్‌లో కేసులు215,096-మృతుల సంఖ్య 10130

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/