ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వానికి సూచన

nara lokesh
nara lokesh

అమరావతిః టిడిపి నేత నారా లోకేశ్ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అడవి తల్లిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. పోలవరం ప్యాకేజీ దగ్గర నుంచి ఎన్నో ఏళ్లుగా గిరిజనానికి హక్కుగా వస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయడం వరకు జగన్ రెడ్డి ఆదివాసులను నమ్మించి వంచించారని మండిపడ్డారు. మాటలతో కోటలు కట్టడం మాని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/