రాజకీయ నేతగా అవతారమెత్తిన నేచురల్ స్టార్ నాని..

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హిట్ నడుస్తుంది. నవంబర్ 30 న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇక రాజకీయ నేతలు ఏ ఫ్లాట్ ఫామ్ ను వదలకుండా ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇక మన నేచురల్ స్టార్ నాని సైతం రాజకీయ నాయకుడి గెటప్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. నాని కూడా ఎన్నికల ప్రచారం చేయబోతున్నాడా అనే రేంజ్ లో కనిపించాడు.

ప్రస్తుతం నాని హాయ్ నాన్న అనే మూవీ తో డిసెంబర్ 07 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొత్త దర్శకుడు శౌర్యవ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన నాని, మృణాల్.. దేన్నీ వదలకుండా సినిమా గురించి హైప్ ఇచ్చేస్తున్నారు.

తాజాగా నాని తన ట్విట్టర్ లో తనకు ఓటు వేసి గెలిపించాలని అభిమానులను కోరాడు. రాజకీయ నాయకుడిలా రెడీ అయ్యి.. ప్రచారానికి వెళ్ళినప్పుడు దండం పెట్టి అడిగినట్లు.. ‘ అంతా ఎన్నికల వాతావరణం కాబట్టి. నేను కూడా ఎందుకు అందులో చేరకూడదు.. డిసెంబర్ 7 న మీ ప్రేమ మరియు ఓటు మాకే వెయ్యాలని.. మీ హయ్ నాన్న పార్టీ ప్రెసిడెంట్ విరాజ్.. కొన్ని సరదా ప్రచార కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.