భారత సంతతికి చెందిన విజయ్ శంకర్‌కు కీలక పదవి

వాషింగ్టన్‌లోని అత్యున్నత న్యాయస్థానానికి జడ్జిగా నామినేట్..వెల్లడించిన ట్రంప్

trump
trump

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన విజయ్‌ శంకర్‌ను దేశ రాజధాని వాషింగ్టన్‌లోని అత్యున్నత న్యాయస్థానానికి జడ్జిగా నామినేట్‌ చేయాలనుకుంటున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ విషయంలో సెనేట్ అంగీకరిస్తే, కొలంబియా కోర్ట్ ఆఫ్ అపీల్స్ కు ఆయన న్యాయమూర్తి అవుతారని ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన క్రిమినల్ విభాగంలో సీనియర్ లిటిగేషన్ కౌన్సిల్ గానూ, అపిలేట్ సెక్షన్ లో డిప్యూటీ చీఫ్ గానూ విధులు నిర్వహిస్తున్నారు. 2012 నుంచి ఆయన అమెరికన్ న్యాయస్థానాల్లో విధుల్లో ఉన్నారు. అంతకుముందు విజయ్ శంకర్, వాషింగ్టన్ లో ప్రైవేట్ ప్రాక్టీస్ చేశారు. మేయర్ బ్రౌన్, ఎల్ఎల్సీ మరియు కన్వింగ్ టన్, బుర్లింగ్ ఎల్ఎల్పీల తరఫున వాదించారు. యూఎస్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ న్యాయమూర్తి చెస్టర్ జే స్టౌబ్ వద్ద లా క్లర్క్ గానూ పనిచేశారు. డ్యూక్ యూనివర్శిటీ నుంచి బీఏ, యూనివర్శిటీ ఆఫ్ వర్జీనియా స్కూల్ ఆఫ్ లా నుంచి జేడీ పట్టాలను పొందారు. ‘వర్జీనియా లా రివ్యూ’కు న్యూస్ ఎడిటర్ గానూ సేవలందించారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/