ప్రధాని నరేంద్ర మోడీతో సిఎం జగన్ భేటి

న్యూఢిల్లీః ఏపి సిఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీని ఢిల్లీలో కలిశారు. ఆయన వెంట వైఎస్‌ఆర్‌సిపి పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డి , ఎంపీలు ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం . రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరినట్లు తెలిసింది. మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, కేంద్ర మంత్రి ఆర్.కె సింగ్ తోనూ జగన్ భేటీ కానున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/