దేశంలో కొత్తగా 9531 కరోనా కేసులు

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో కొత్తగా 9531 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,43,48,960కి చేరాయి. ఇందులో 4,37,23,944 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,368 మంది మరణించారు. మరో 97,648 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 36 మంది కరోనాకు బలవగా, 11,726 మంది కోలుకున్నారు. ఇక మొత్తం కేసుల్లో 0.22 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.59 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా 210.02 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడు రోజుల్లో 80,579 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ప్రకటించింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/