విశాఖలోని హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం
ప్రాణనష్టం జరగక పోవటంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు

Visakhapatnam: విశాఖ లో హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హెచ్‌పీసీఎల్ పరిసరాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళన లో ఉన్నారు. . ఈ ఘ్టనపై మూడు సార్లు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా హెచ్‌పీసీఎల్ పరిసర ప్రాంత ప్రజల్ని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ఇదిలా ఉంటే, మంటలను అదుపులోకి తీసుకొస్తోంది. ప్రమాద సమయంలో అక్కడ సుమారు 100 మంది ఉద్యోగులు ఉన్నారని.. వారంతా క్షేమంగానే ఉన్నారని తెలిసింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/