మాజీ మంత్రి నారాయణ ఇంట విషాదం

నేటి ఉదయం తుది శ్వాస విడిచిన ఆయన తల్లి

p. narayana
p. narayana

అమరావతి: టిడిపి నేత, మాజి మంత్రి నారాయణ ఇంట విషాదం జరిగింది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన తల్లి సుబ్బమ్మ నేటి ఉదయం తుది శ్వాస విడిచింది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్‌ చేసి నారాయణను పరామర్శించారు. ఈ విషాదంపై పలువురు టిడిపి నేతలు సంతాపాన్ని ప్రకటించారు. కాగా సుబ్బమ్మకు రెపు అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/