కోవిడ్ వ్యాక్సినేషన్ ను ప్రారంభించిన సీఎం జగన్

హెల్త్ వర్కర్‌ పుష్పకుమారికి తొలి టీకా

AP CM Jagan launches vaccination in Vijayawada
AP CM Jagan launches vaccination in Vijayawada

Vijayawada: ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి (జీజీహెచ్‌)లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోవిడ్ టీకా కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ముందుగా ముఖ్యమంత్రి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. హెల్త్ వర్కర్‌ పుష్పకుమారికి తొలి టీకాను వైద్యులు వేశారు. అనంతరం హెల్త్‌వర్కర్ నాగజ్యోతికి వ్యాక్సిన్ ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా 332 కేంద్రాల్లో 3.87 లక్షల మందికి తొలిదశలో వ్యాక్సిన్‌ వేయనున్నారు. విజయవాడలోని గన్నవరం వ్యాక్సిన్‌ స్టోర్‌ నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్‌ను పంపిణీ  చేశారు. తొలుత జిజిహెచ్ కు చేరుకున్న ముఖ్యమంత్రి కి డిప్యూటీ సీఎం ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని ), దేవాదాయ శాఖ మంత్రి  వెలంపల్లి శ్రీనివాసరావు , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఆదిత్యనాధ్ దాస్ , ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి  అనిల్ కుమార్ సింఘాల్ , కమీషనర్ కె భాస్కర్ , జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ తదితరులు స్వాగతం పలికారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆరోగ్య శాఖ  ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ , కమిషనర్ కె.భాస్కర్ లు కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియను, సాంకేతిక అంశాలను వివరించారు 
రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ ను జిజిహెచ్ పారిశుధ్య సిబ్బంది బి .పుష్ప కుమారికి అందచేశారు 
తదుపరి  సిహేచ్ నాగజ్యోతి (నర్స్), పి జయకుమార్ , ఓ టి అసిస్టెంట్ , డా . ఎల్ .ప్రణీత, జనరల్ ఫీజిషన్ , డా . బి .భసవేశ్వర్ లకు వ్యాక్సిన్ అందించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/