కృష్ణమ్మకు మొదటి వ్యాక్సిన్
గాంధీ హాస్పిటల్ సపాయి కార్మికురాలు

Hyderabad: తొలి టీకాను గాంధీ హాస్పిటల్ సపాయి కార్మికురాలు ఎస్. కృష్ణమ్మ వేయించుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర సమక్షంలో గాంధీ హాస్పటల్లో కృష్ణమ్మకు టీకాను వైద్యులు వేశారు..
ఈ సందర్భంగా మంత్రులు ఆమెను అభినందించారు.. కరోనా టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా రికార్డులోకి ఎక్కింది. టీకా ఇచ్చిన అనంతరం ఆమెతో మంత్రి ఈటల రాజేందర్ సంభాషించారు. అనంతరం ఆమెను అబ్జర్వేషన్ గదికి తరలించారు.
నిమ్స్ లో గవర్నర్ తమిళ సై సమక్షంలో ఇక్కడి సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రారంభమైంది..
తెలంగాణలో 33 జిల్లాలో ఏర్పాటు చేసిన 139 ఆరోగ్య కేంద్రాలలో కోవిషీల్డ్ టీకా కార్యక్రమాన్ని ముందుగా నమోదు చేసుకున్న హాస్పటల్స్ సపాయి కార్మికులకు, ఇతర వైద్య సిబ్బందికి వేస్తున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/