మరోసారి అనారోగ్యానికి గురైన సమంత

Samantha-At-Shaakuntalam-Trailer-Launch
Samantha-At-Shaakuntalam-Trailer-Launch

సమంత అభిమానులకు బ్యాడ్ న్యూస్. మరోసారి సమంత అస్వస్థతకు గురయ్యారు. కొద్దీ నెలల కిందట మయోసైటిస్ రుగ్మతకు గురైన సంగతి తెలిసిందే. చాలా రోజుల పాటు మయోసైటిస్ కు చికిత్స తీసుకున్న సామ్..మయోసైటిస్ నుండి కోలుకోవడం తో మళ్లీ సినిమా షూటింగ్లలో , ప్రమోషన్లలో బిజీ అయ్యింది. ఆమె నటించిన శాకుంతలం విడుదలకు సిద్ధమైంది.

ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సమంత బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో, సమంత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈరోజు ఎంఎల్ఆర్ఐటీలో జరగాల్సిన శాకుంతలం ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొనడంలేదని తెలిపింది. వరుసగా ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొనడం వల్ల అనారోగ్యానికి గురయ్యానని వివరించారు. శాకుంతలం టీమ్ తో కలిసి అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. అందరినీ మిస్సవుతున్నానని తెలుపుతూ విచారం వ్యక్తం చేసింది.