రైతులకు రూ.1200 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ

ఏపీ కేబినెట్ ఆమోదముద్ర

AP CM YS Jagan
AP CM YS Jagan

Amaravati: రైతులకు రూ.1200 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ చెల్లింపునకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ప్రతి భూమికీ సబ్ డివిజన్ ప్రకారం మ్యాపులు తయారు చేయాలని నిర్ణయించింది.  రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఇక రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని నేరుగా ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు జరపాలని నిర్ణయించింది.

  ఏపీ వైద్య విద్య పరిశోధన కార్పొరేషన్ ఏర్పాటు ఆర్డినెన్స్ కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అలాగే ష్ట్రంలో నూతన టూరిజం పాలసీకి ఆమోముద్ర వేసింది. 

నివర్ తుపాను బాధితులకు ఈ డిసెంబరు చివరిలోగా పరిహారం అందజేయాలని నిర్ణయించింది. రైతులకు ఏ సీజన్ లో పరిహారం ఆ సీజన్ లోనే చెల్లింపులు జరిపేందుకు కేబినెట్ నిర్ణయించింది. 6 జిల్లాల్లో వాటర్ షెడ్ అభివృద్ధి పథకం అమలుకు ఆమోముద్ర వేసింది.

అలాగే టూరిజం ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజి కింద ఆర్థిక సాయం చేసేందుకు ఆమోదం తెలిపింది. హోటల్ రంగం పునరుజ్జీవం కోసం రూ.15 లక్షల వరకు రుణం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/