రెండు ఎకరాల పొలం కొనుగోలు చేసిన బన్నీ..ఎంత ధర పెట్టాడో తెలిస్తే షాకే

సినీ స్టార్స్ అంత భూమి కొనుగోళ్ల ఫై మక్కువ చూపిస్తున్నారు. ఈ మధ్యనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి లో ఆరున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బాటలోనే అల్లు అర్జున్ నిలిచారు. తాజాగా రంగా రెడ్డి జిల్లాలోని జనవాడ గ్రామం పరిధిలో రెండు ఎకరాల పొలాన్ని రెండు కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు. ఈ భూమి రిజిస్ట్రేషన్ కొరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు శంకర్ పల్లి తహసిల్దార్ కార్యాలయానికి వచ్చారు అల్లు అర్జున్. ఇక రిజిస్ట్రేషన్ అనంతరం తహసిల్దార్ సైదులు అల్లు అర్జున్ కు ప్రోసిడింగ్ ఆర్డర్ అంద జేశారు. అల్లు అర్జున్ రాక తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప అనే పాన్ మూవీ చేస్తున్నాడు. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17 న మొదటి భాగం విడుదల కాబోతుంది. ఈ మూవీ లో అల్లు అర్జున్ కు జోడిగా రష్మిక నటిస్తుంది. సునీల్ , అనసూయ మొదలగు టాప్ మోస్ట్ నటి నటులు ఇందులో నటిస్తున్నారు. దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తుండగా..మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.