శ్రీవారిని దర్శించుకున్న ఏపి,కర్ణాటక సీఎంలు

శ్రీవారి మహాద్వారం వద్ద కర్ణాటక ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన జగన్Jagan Welcomes Yadeyurappa in Tirumala

jagan-welcomes-yediyurappa-in-tirumala

తిరుమల: ఏపి, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, యడియూరప్పలు ఈ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. స్వామి సన్నిధికి వచ్చిన యడియూరప్పకు మహాద్వారం వద్ద సిఎం వైఎస్ జగన్ స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం వేద పండితులు ఇద్దరు ముఖ్యమంత్రులకు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. ఆపై ఆలయానికి ఎదురుగా ఉన్న నాద నీరాజనం వద్ద నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణంలో ఇద్దరూ పాల్గొన్నారు. మరికాసేపట్లో కర్ణాటక సత్రాల భవన నిర్మాణ భూమి పూజలో పాల్గొన్న అనంతరం, 10:20కి రేణిగుంట ఎయిర్ ‌పోర్ట్ కు చేరుకోనున్న జగన్, అక్కడి నుంచి గన్నవరం బయల్దేరనున్నారు. కాగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 9.30గంటలకు హనుమంత వాహనంపై స్వామి వారు దర్శనమివ్వనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/