తెలంగాణలో కొత్తగా 2,176 కేసులు నమోదు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,79,246..మొత్తం మృతుల సంఖ్య 1,070

corona virus-telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 2,176 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,79,246 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,037 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా 2004 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా.. మొత్తం 1,48,139 మంది బాధితులు ఇండ్లకు వెళ్లారు. వైరస్‌ ప్రభావంతో కొత్తగా 8 మంది మృత్యువాతపడగా.. ఇప్పటికీ 1070 మంది మరణించారు. రాష్ట్రంలో కొవిడ్‌ మరణాల రేటు 0.59శాతం ఉందని, రికవరీ రేటు 81.42శాతంగా ఉందని వైద్యశాఖ తెలిపింది. మరో 23,929 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/