సినిమాటోగ్రాఫర్ గా మారిన అనుపమ

అనుపమ లోని మరో కోణాన్ని బయటపెట్టింది. “ఐ మిస్ యు ” అనే షార్ట్ ఫిలిం తో ఈమె సినిమాటోగ్రాఫర్ గా మారి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రేమమ్ మూవీ తో తెలుగు లో అడుగుపెట్టిన ఈ చిన్నది..ఆ తర్వాత శతమానం భవతి, ఉన్నది జిందగీ ఒకటే వంటి వరుస హిట్స్ అందుకుంది. ఆ తర్వాత హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా చిత్రసీమలో రాణిస్తూ వస్తుంది. ఈ మధ్య హాట్ హాట్ ఫోజులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.

ఇదే తరుణంలో తనలోని మరోకోణాన్ని బయటపెట్టింది. సంకల్ప్ గోరా దర్శకత్వంలో వచ్చిన “ఐ మిస్ యు ” అనే షార్ట్ ఫిలిం తో ఈమె సినిమాటోగ్రాఫర్ గా మారి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ షార్ట్ ఫిలిం యూట్యూబ్ ఛానల్ చాయ్ బిస్కెట్ లో అందుబాటులో ఉంది. ఈ షార్ట్ ఫిలింలో అనుపమ కెమెరా వర్క్ కి విపరీతమైన స్పందన లభిస్తోంది. యుఎస్ లో నివసిస్తున్న ఒక యువకుడు తన తల్లిదండ్రులతో అతని సంబంధం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మొత్తానికి అయితే ఈ షార్ట్ ఫిలిం కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఒక హీరోయిన్ ఇలా ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయడం సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇదే మొదటిసారి. ఆ ఘనత అనుపమ సాధించడం తో అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ఈమె ప్రస్తుతం తెలుగు లో డీజే టిల్లు 2 మూవీ చేస్తుంది.