బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ ఇదేనా..?

నార్త్ లో సూపర్ సక్సెస్ అయినా బిగ్ బాస్..సౌత్ లోను అంతే సక్సెస్ అవుతూ వస్తుంది. తెలుగు లో అయితే ఈ షో కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సీజన్ ..సీజన్ కు ప్రజలకు మరింత దగ్గరవుతుంది. ఇక ఇప్పుడు సీజన్ 6 తో అలరించేందుకు సిద్ధమైంది. దీనికి సంబదించిన ప్రోమో ను మంగళవారం రిలీజ్ చేసి ఆకట్టుకోగా..తాజాగా కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ ఇదే అంటూ కొంతమంది పేర్లు బయటకొచ్చాయి. అంతే కాదు సెప్టెంబర్ 4 సాయంత్రం 6 గంటలకు..బిగ్ బాస్ సీజన్ 6 న మొదలుపెట్టబోతున్నట్లు వినికిడి. ఇక ఈ సీజన్ లో 15 మంది కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ నిర్వాహకులు ఫైనల్ చేసారని అంటున్నారు.

ప్రస్తుతం మీడియా లో ప్రచారం అవుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ ఇలా ఉంది.టీవీ 9 యాంకర్ ప్రత్యూష, ఆర్జే సూర్య , యూట్యూబర్ నిఖిల్, సోషల్ మీడియా ఫేమ్ శ్రీహాన్ (సిరి బాయ్ ఫ్రెండ్), గాయని మోహన భోగరాజ్, ఆర్టిస్ట్ నందు(సింగర్ గీతా మాధురి భర్త), యాంకర్ వర్షిణి, హీరో భరత్(చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు)తో పాటు యాంకర్ శ్రవంతి చొక్కారపు, ‘ఢీ’ ఫేమ్ కొరియోగ్రాఫర్ పప్పీ మాస్టర్, హీరోయిన్ సంజనా చౌదరి లను కంటెస్టెంట్స్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఇంకో ముగ్గురిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా షోలో పంపించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు సమాచారం. మరి నిజంగా వీరేనా..కదా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.