సీతారామం మూవీ నాల్గు రోజుల కలెక్షన్స్

మహానటి ఫేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సీతారామం’. సుమంత్, డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్, తరుణ్‌ భాస్కర్‌, మురళి శర్మ, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలకపాత్రలు పోషించగా.. హను రాఘవపూడి డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో అశ్వినీదత్‌ నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ మూవీ ఆగస్టు 5న తెలుగు తో పాటు పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది.

నాల్గు రోజుల్లో వరల్డ్ వైడ్ గా కలెక్షన్లు చూస్తే..

నైజాం రూ. 3.10 కోట్లు, సీడెడ్‌లో 83 లక్షలు, ఉత్తరాంధ్రలో 1.09 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 70 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 48 లక్షలు, గుంటూరు జిల్లాలో 56 లక్షలు, కృష్ణా జిల్లాలో 61 లక్షలు, నెల్లూరు జిల్లాలో 29 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 7.66 కోట్ల షేర్, 14.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో 100k డాలర్ల క్లబ్‌లో చేరింది. అమెరికాలో 600k డాలర్లకుపైగా వసూలు చేసింది. దీంతో ఓవర్సీస్‌లో ఈ చిత్రం 3.15 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. వరల్డ్ వైడ్ గా నాల్గు రోజుల్లో రూ. 13.61 కోట్ల షేర్, 27 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.