కరోనా ఎఫెక్ట్..షిప్‌లో 3711 మంది ప్రయాణికులు

24 గంటలు ముగిసినా అనుమతించని అధికారులు

cruise ship
cruise ship

టోక్యో: ప్రాణాంతకంగా మరినా కరోనా వైరస్‌ యావత్ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈనేపథ్యలో వ్యాధి భయంలో 3711 మందితో ఉన్న ఓ ప్రయాణికుల నౌకను జపాన్‌ తీరానికి అనుమతించకుండా ప్రాదేశిక జలాల్లోనే నిలిపివేంది. ప్రయాణికుల్లో కరోనా బాధితులు ఉన్నారన్న వార్తల నేపథ్యంలో ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది. దీంతో నౌకలో 2,666 మంది ప్రయాణికులు, 1045 మంది సిబ్బంది ఇప్పటికి 24 గంటల నుంచి దిక్కుతోచని స్థితిలో ఎప్పటికి అనుమతి వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. జపాన్‌కు చెందిన ఈ క్రూయిజ్‌ షిప్‌ నిన్న యొకొహోమా తీరానికి చేరుకుంది. అయితే ప్రయాణికుల్లో కొందరు కరోనా బాధితులు ఉన్నారన్న వార్తతో వైద్యాధికారులు తీరంలో నిలిపి ఉంచిన నౌకలోకి వెళ్లారు. పరీక్షలు నిర్వహించగా హాంకాంగ్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధునికి వైరస్‌ సోకినట్లు నిర్థారించారు. దీంతో అధికారులు ప్రయాణికులు ఎవరూ నౌక నుంచి ఒడ్డుకు వచ్చేందుకు అనుమతించడం లేదు. ఇటీవల ఇదే నౌకను ఒకినోవా పోర్టు తీరంలోనూ ఆపేశారు. కరోనా విషయంలో జపాన్‌ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/