తిరుమల నడక మార్గంలో మరో చిరుత చిక్కింది

తిరుమల నడక మార్గంలో గత కొద్దీ రోజులుగా చిరుతలు సంచరిస్తూ భక్తులను భయబ్రాంతులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిరుతల భయానికి చాలామంది భక్తులు నడకదారిలో వెళ్లడం తో..ఈ మధ్యనే ఓ చిన్నారి ఫై కూడా చిరుత దాడి చేసి చంపేసింది. ఈ ఘటన తర్వాత అలర్ట్ అయినా TTD చిరుతలు బంధించేందుకు బోనులు ఏర్పాట్లు చేసింది. రీసెంట్ రెండు చిరుతలు చిక్కగా..నిన్న రాత్రి మరో చిరుత బోనులో పడింది.

నడక మార్గంలోని 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో వేకువజామును చిరుత చిక్కిందని సీసీఎఫ్‌ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు చిరుతలను బంధించామన్నారు. నడక మార్గంలో ట్రాప్‌ కెమెరాలతో వన్య ప్రాణుల సంచారాన్ని నిరంతరం మానిటరింగ్‌ చేస్తామని నాగేశ్వరరావు తెలిపారు. చిన్నారిని చంపిన చిరుతల నమూనా తెలుసుకునేందుకు మరో వారం రోజుల్లో రిపోర్టులు వస్తాయని ఆయన వెల్లడించారు.