18వ తేదీ నుండి దేశీయ విమాన సర్వీసులు?

flights

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డైన్‌ కారణంగా దేశీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే దేశీయ విమాన సర్వీసులను ఈనెల 18 తేదీ నుండి నడపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. డిజిసిఎం,సిఐఎస్‌ఎఫ్‌, విమానాశ్రయాల ప్రాధికారాల సంస్థ అధికారులు, డిఐఎఎల్‌ అధికారులతో కూడిన కమిటీ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ విమానాల సర్వీసుల ప్రారంభానాకి సంబంధించి సన్నద్దతపై పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూర్‌, హైదరాబాద్‌ల నుండి దేశీయ విమాన సర్వీసులను నడుపనున్నటు తెలుస్తుంది.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/