ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల నుండి పోటీ – ఈటెల

తెలంగాణ లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ బిఆర్ఎస్ ముందుగానే అభ్యర్థుల ప్రకటన చేసి జనాల్లోకి వెళ్లాలని సూచించింది. మొత్తం 115 మందితో కూడిన లిస్ట్ ను సోమవారం కేసీఆర్ ప్రకటించారు. ఈ 115 మందిలో ఎక్కువగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకె ఛాన్స్ ఇచ్చాడు. అలాగే రెండు స్థానాల నుండి కేసీఆర్ పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేయడం ఫై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు.

గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి బరిలో దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. గజ్వేల్‌ సురక్షితమే అని ప్రచారం జరుగుతున్నా.. మరో స్థానం నుంచి కూడా పోటీ చేయాలని పార్టీలో కొందరు ముఖ్య నేతలు కేసీఆర్ కు సూచించినట్లు సమాచారం. బీజేపీకి భయపడే అభ్యర్థుల లిస్ట్‌ను కేసీఆర్ ముందే ప్రకటించారని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రటించిన లిస్ట్‌లో ఉన్న సగం మంది ఓడిపోవడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల నుండి పోటీ చేస్తున్నాడని ఎద్దేవా చేసారు ఈటెల.