మహారాష్ట్రలో వరుస భూకంపాలు

మహారాష్ట్రలో వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురి చేసాయి. పాల్ఘర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 5:15 అలాగే 5:28 సమయంలో వరుసగా రెండు సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రకంపణ తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.5, 3.3 తీవ్రత నమోదైనట్లు.. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ధృవీకరించింది.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తో పాటు, పాల్ఘర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ప్రకంపనలను ధృవీకరించింది. జిల్లాలోని తలసరి ప్రాంతంలో వరుసగా ఎనిమిది కిలోమీటర్లు, ఐదు కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించాయని ఆయన తెలిపారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా నష్టం జరిగినట్లు ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదని అధికారి తెలిపారు