అమెరికాలో భారీగా పెరిగిపోతున్న నిరుద్యోగులు

గతవారం మరో 15లక్షల మంది దరఖాస్తు

Employment crisis in America

అమెరికా: అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. దీంతో వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ,ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. ఈ క్రమంలో లక్షలాది మంది అమెరికన్లు ఉద్యోగం, ఉపాధి కోల్పోయారు. గతవారం దాదాపు 15 లక్షల మంది అమెరికన్లు నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు యూఎస్ లేబర్ డిపార్ట్‌మెంట్ అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలను చాలా వరకు సడలించింది. అయినప్పటికీ నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య భారీ స్థాయిలో నమోదవుతోంది. గత వారం జూన్ 13 వరకు దాదాపు 15లక్షల మంది అమెరికన్లు నిరుద్యోగ ప్రయోజనాల కోసం అర్జీ పెట్టుకున్నారు. కాగా.. అంతకు ముందు వారంతో పోల్చితే దరఖాస్తుల సంఖ్య గత వారం తగ్గినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. ఇప్పటి వరకు అమెరికాలో నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నా వారి సంఖ్య 4 కోట్లు దాటింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/