బీజింగ్‌లో మరో 25 కొత్త కేసులు

వారం రోజుల్లో 183 కరోనా కేసులు

China reports 25 new Coronavirus cases in Beijing

బీజింగ్‌: చైనాలో మరోమారు కరోనా కేసులు పెరుగుతున్నాయి. రెండో దశ కేంద్రంగా మారిన బీజింగ్‌లో కొత్తగా 25 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో గత వారం రోజుల్లో కరోనా కేసులు 183కి చేరాయని నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ (ఎన్‌హెచ్‌సీ) వెల్లడించింది. మార్చి 30 తర్వాత దేశంలో కొత్తగా కరోనా కేసులు జూన్‌ 11న వెలుగులోకి వచ్చాయి. దీంతో వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి బీజింగ్‌లో లాక్‌డౌన్‌ విధించింది. రాజధానిలోని మార్కెట్లను మూసివేయడంతోపాటు, ప్రజలు బయటికి రాకుండా డజన్ల కొద్ది నివాస సముదాయాలను పూర్తిగా నిర్బంధంలోకి తీసుకువచ్చింది. దీనికితోడు వేల సంఖ్యలో న్యూక్లిక్‌ యాసిడ్‌ టెస్టులను నిర్వహించింది. రాజధానిలో కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదవతుండటంతో చైనా ప్రభుత్వం తాజాగా వైరస్‌ జీనోమ్‌ డాటాను విడుదల చేసింది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/