విజయవాడలోనే గణతంత్ర వేడుకలు

తొలుత విశాఖలో వేడుకలు జరుగుతాయని ప్రచారం

cm jagan
cm jagan

అమరావతి: ఏపి గణతంత్ర వేడుకలను మొదటగా విశాఖపట్నంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సిఎం జగన్‌ సర్కారు ఇప్పుడు అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. విజయవాడలోనే ఈ వేడుకలు జరుగుతాయని, అందుకు ఏర్పాట్లు చేయాలని కొద్దిసేపటి క్రితం మునిసిపల్ అధికారులకు ఆదేశాలు అందాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించాలని ఆదేశాలు అందడంతో, అధికారులు హుటాహుటిన స్టేడియంకు చేరుకున్నారు. కాగా, విశాఖలో ఇప్పటికే రిపబ్లిక్ వేడుకల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/