నక్షి కుందన్‌ నగలు

Nakshi Kundan Jewelry

తాజా ట్రెండ్‌కు తగిన నగలు కొంటే నలుగురిలో ప్రత్యేకంగా కనిపించవచ్చు. అలాంటి నగల్లో చెప్పుకోదగినవి నక్షి కుందన్‌ కలిసిన నగలు. సందర్భాన్ని బట్టి అరుదైన డిజైన్లను ఎంచుకోగలిగితే మంచిది. నక్షి కుందన్‌ నగలు అంత తొందరగా నల్లబడవు. పైగా వీటిలో తాజాగా కొత్త కొత్త డిజైన్లు మార్కెట్లోకి వస్తున్నాయి.

ఎక్కువ బంగారం. తక్కువ కుందన్‌ ఉండడం వల్ల పెట్టుబడికి తగిన ఫలం కూడా ఉంటుంది. వీటిలో లాంగ్‌ హారం, ఝుంకాలు, వడ్డాణాలు, కడాలు ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌. నక్షి కుందన్‌ నగలకు రెండు రకాల పాలిష్‌లు చేయించుకోవచ్చు. పసిడి వెలుగులు విరజిమ్మే గోల్డ్‌ పాలిష్‌ లేదా యాంటిక్‌ లుక్‌ కోసం యాంటిక్‌ పాలిష్‌ చేయించుకోవచ్చు. ఈ పాలిష్‌ వేసేందుకు ఒక రోజు పడుతుంది. ఒక పాలిష్‌ వేయించుకున్న తర్వాత మార్పించుకోవాలనుకున్నా కొంత కాలం తరువాత మార్పించుకోవచ్చు. ఝుంకాల్లో టు స్టెప్‌ ఝుంకీ, చాంద్‌బాలీ కమ్‌ ఝుంకీ డిటాచబుల్‌ రకం ఎంచుకోవచ్చు. లాంగ్‌హారంలో మగ్రీ మాలా లేదా బిందీ మాలా. మ్యాంగో మాలా లేటెస్ట్‌ ఫ్యాషన్‌.

వడ్డాణంలో పెండెంట్‌ ఉన్నవి లేదా నక్షితో పాటు కొంత కుందన్‌ ఉన్నవి బాగుంటాయి. కడాల్లో కొత్తదనం కోరుకునే వారు చక్కని పనితనం ఉన్న అరుదైన డిజైన్లను ఎంచు కోవాలి. వీటికే ఎక్కువ ఆదరణ దక్కుతుంది. కాబట్టి నగల ఎంపికలో ఈ జాగ్రత్తలు పాటించాలి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/