హీరో విక్రమ్ హెల్త్ బులెటిన్ విడుదల..

‘అపరిచితుడు’ ఫేమ్ విక్రమ్ హాస్పటల్ చేరారనే వార్త అభిమానులతో పాటు చిత్రసీమను కలవరపాటుకు గురిచేసింది. విక్రమ్ గుండెపోటు తో చెన్నైలోని కావేరి హాస్పటల్ లో చేరారనే వార్త సోషల్ మీడియా లో వైరల్ కావడం తో అంత ఖంగారుపడుతూ..విక్రమ్ ఆరోగ్యం ఫై ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో హాస్పటల్ వర్గం విక్రమ్ ఆరోగ్యం తాలూకా హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది.

విక్రమ్‌కు ఛాతిలో నొప్పిరావడంతో ఆయన ఆసుపత్రిలో జాయన్ అయ్యాడని.. నిపుణులైన డాక్టర్లతో ఆయనకు వైద్యం అందించామని.. ఆయనకు ఎలాంటి గుండెపోటు రాలేదని.. ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. త్వరలోనే ఆయన్ను డిశ్చార్జ్ చేస్తామని కావేరీ ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. తమ హీరో త్వరగా కోలుకొని ఇంటికి క్షేమంగా రావాలని విక్రమ్ అభిమానులు కోరుతున్నారు. ఇక సోషల్ మీడియా లో వైరల్ గా మారిన గుండెపోటు వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది.

తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘బంగారు కుటుంబం’ , ‘చిరునవ్వుల వరమిస్తావా’ వంటి చిత్రాల్లో నటించిన విక్రమ్ ఆ తరువాత తమిళ ఇండస్ట్రీ లో స్థిరపడ్డారు. అయితే సూర్యతో కలిసి నటించిన ‘శివ పుత్రుడు (పితామగన్)’, శంకర్ తెరకెక్కించిన ‘అపరి చితుడు’ సినిమాలు తెలుగులో హీరోగా విక్రమ్ కు మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. ఈ చిత్రాల తరువాత తెలుగులో విక్రమ్ కు మంచి మార్కెట్ తో పాటు భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ లభించడం మొదలైంది. గత కొంత కాలంగా హీరోగా ఫామ్ ని కోల్పోయిన విక్రమ్ ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందులో ఒకటి ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వం’ , మరోటి జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ‘కోబ్రా’. ఈ మూవీలో విక్రమ్ దాదాపు 11 గెటప్ లలో కనిపించబోతుండడం విశేషం.