కోట్లాది త్యాగాల ఫలితం తెలంగాణ

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

pawan kalyan
pawan kalyan

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ రోజు చారిత్రాత్మకమైనదని అభివర్ణించారు. వేలాది బలిదానాలతో, కోట్లాది మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు నడిపే నేతలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలపై ఉందన్నారు. కోట్లాది మంది కల సాకారమైన ఈ రోజున తెలంగాణ సాధనలో ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు అంజలి ఘటిస్తున్నట్టు పవన్‌ తన ట్విటర్‌ ఖతాలో పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/