సింగరేణి గనుల్లో భారీ పేలుడు.. ఐదుగురి మృతి

ముడిపదార్థాలు నింపుతుండగా విస్ఫోటనం

సింగరేణి గనుల్లో భారీ పేలుడు.. ఐదుగురి మృతి
singareni-mines

పెద్దపల్లి: రామగిరి మండలం ఓపెన్‌ కాస్ట్‌ 1లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఓపెన్ కాస్ట్1 గనిలోని ఫేజ్2లో బ్లాస్టింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బ్లాస్టింగ్ కు అవసరమైన ముడిపదార్థాలు నింపుతున్న సమయంలో ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించింది. పేలుడు ధాటికి సంఘటన స్థలంలో బీభత్సం నెలకొంది. ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వారి దేహాలు ఛిద్రం అయ్యాయి. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని గోదావరిఖనిలోని సింగరేణి ఆసుపత్రికి తరలించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/