దేశ ప్రజలకు ఏడు సూత్రాలు

తప్పక పాటించాలని ప్రధాని వినతి

PM Narendra Modi

దిల్లీ: జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ దేశ ప్రజలు తప్పకపాటించవలసిన ఏడు సూత్రాలతో ఓ సప్తపదిని ప్రకటించారు. ఈ 19 రోజులు వాటిని అమలు చేయాలని సూచించారు. అవి..

  • వయసు పైబడిన పెద్దవారిని కోవిడ్‌నుండి కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి.
  • డాక్టర్‌లు, పోలీసులకు, పారిశుద్య కార్యికులకు గౌరవం ఇవ్వాలి.
  • ఆకలితో ఉన్న వారికి ఆహరాన్ని అందించేందుకు వీలైనంత సాయం చేయాలి.
  • ప్రైవేటు ఉద్యోగులను తొలగించే ఆలోచనలను యాజమాన్యాలు చేయరాదు.
  • రోగనిరోధక శక్తిని పెంచుకునేలా పోషకాహరాన్ని తీసుకోవాలి.
  • ఆరోగ్యసేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, కరోనా పై ప్రతిక్షణం సమాచారం తెలుకోవాలి.
  • ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలి. ఒకరితో ఒకరు దగ్గరగా మెసలవద్దు.
    ఈ సూత్రాలను పాటించడం ద్వారా దేశం నుండి కరోనాను తరిమికొట్టవచ్చు అని ప్రధాని తెలిపారు. ప్రతి ఒక్కరు వీటిని విధిగా పాటించాలని సూచించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/