రాజధాని అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా

High court of andhra pradesh
High court of andhra pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పరిధిలో గల గ్రామాల్లో విధించిన పోలీసుల ఆంక్షలపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. కాగా ఏపి రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 విధించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజధానిలో కఠినమైన సెక్షన్లను విధించడంపైనా, మహిళలపై దాడుల అంశాన్ని కూడా న్యాయస్థానం ప్రస్తావించింది. దీనికి ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ స్పందిస్తూ, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై విచారణ జరుపుతున్నామని కోర్టుకు తెలిపారు. ఏజీ వివరణను విన్న తర్వాత తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది. రాజధాని అంశంలో రైతులు, మహిళలు మాత్రమే కాకుండా న్యాయవాదులు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని హైకోర్టు కూడా సుమోటోగా స్వీకరించింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/