బెంగాల్ ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదు
సీఏఏ, ఎన్ఆర్సీల ప్రభావం పశ్చిమ బెంగాల్ ప్రజలపై పడనీవ్వను

డార్జిలింగ్: సీఏఏ, ఎన్ఆర్సీకి సంబంధించి పశ్చిమబెంగాల్ ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని, బెంగాల్ ప్రజలపై వీటి ప్రభావం పడనీయనని ఆ రాష్ట్రా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భరోసా ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ బుధవారం నాడు డార్జిలింగ్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రదర్శకులు నో ఎన్ఆర్సీ, నో సీఏఏ అనే ప్లకార్డులు పట్టుకుని మరికొందరు జాతీయ జెండాలు పట్టుకుని నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. నేను మీతోనే ఉన్నాను. మిమ్మల్ని ఎవరూ ముట్టుకునే సాహసం చేయలేరని అన్నారు. ఇది మనభూమి, ఇక్కడ వారిని ఎవరూ విభజించలేరని అన్నారు. కాగా గత డిసెంబర్లో ఎన్ఆర్సీని పార్లమెంట్ ఆమోదించగానే మమతా బెనర్జీ ఈ కొత్త చట్టానికి వ్యతిరేకంగా తన వాణి వినిపించారు. అనంతరం సీఏఏకు వ్యతిరేకంగా క్రమం తప్పకుండా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/