మంత్రి ఆళ్ల నాని ఆకస్మిక తనిఖీ

ఎలుకలు తిరుగుతున్న మార్చురీలో మృతదేహాన్ని ఎవరు వేశారు ?

Alla Nani
Alla Nani

పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికలెక్టర్‌ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. శనివారం ఉదయం ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి ఆళ్ల నాని, కలెక్టర్‌ లు ఆకస్మిక తనిఖీ చేశారు. మార్చురీలో ఎలుకలు ఎలా వచ్చాయంటూ వైద్యాధికారులను ప్రశ్నించారు. ఎలుకలు తిరుగుతున్న మార్చురీలో మృతదేహాన్ని ఎవరు వేశారు ? అని నిలదీశారు. ఇందుకు వైద్యాధికారులు ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో కలెక్టర్‌, మంత్రి వైద్యాధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. మార్చురీలో ఎలుకల మధ్య మృతదేహాన్ని ఉంచిన ఘటన జరిగి.. ఇన్ని రోజులయినా వివరాలేవీ మీ వద్ద లేవంటే.. అర్థమేంటి ? అని కలెక్టర్‌ ఆగ్రహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటనపై ప్రస్తుతం కలెక్టర్‌ విచారణ కొనసాగుతోంది. విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/