ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు

ఈనెల 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు

అమరావతి: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కర్ఫ్యూను ఏపీ ప్రభుత్వం మరోమారు పొడిగించింది. ఈ నెల 20 వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూ గడువు ఈ నెల 10తో ముగుస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం జగన్‌ మరో పది రోజులపాటు కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూన్‌ 10 తర్వాత ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు కర్ఫ్యూ సడలింపు సమయం పెంచారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు ప్రభుత్వ కార్యాలయాలు పని చేయనున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/