వైరస్ తరువాత భారత్ కు ఎంతో ప్రాముఖ్యత

చక్కటి డీల్ కుదిరిందంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్

Anand Mahindra
Anand Mahindra

ముంబయి: జియోలో ఫేస్‌ బుక్‌ పెట్టుబడి పెట్టిన నిర్ణయంపై మహీంద్రా అండ్‌ మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్వాగతించారు. ఈ డీల్ తో కేవలం ముఖేశ్ అంబానీ మాత్రమే కాదని, భారతీయులంతా లాభపడతారని తన ట్విట్టర్ ఖాతాలో ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా దిగ్గజంతో మెగా డీల్ ను కుదుర్చుకున్న రిలయన్స్ అధినేతను ఆయన పొగడ్తల్లో ముంచెత్తారు. ‘ఫేస్ బుక్ తో జియో డీల్ ఆ రెండు కంపెనీలకు మాత్రమే మేలును కలిగించదు. వైరస్ కష్టాల నేపథ్యంలో ఈ డీల్ కుదిరింది. వైరస్ తరువాత భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందోననడానికి ఈ డీల్ బలమైన సంకేతం. ప్రపంచ వృద్ధికి ఇండియా సరికొత్త కేంద్రం కానుందన్న ఊహ ప్రపంచానికి బలంగా అందించింది. చాలా చక్కటి డీల్ ను కుదుర్చుకున్నారు. బ్రావో ముఖేశ్ ‘ అని ఆయన అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/